నాని నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్

నాని నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్

Published on Nov 30, 2015 8:38 AM IST

nani2
ఈ ఏడాది ‘భలే భలే మగాడివోయ్’తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా దాదాపు పూర్తవడంతో నాని తన ఫోకస్ ని తదుపరి సినిమా పైకి షిఫ్ట్ చేయనున్నాడు. నాని తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇదివరకే తెలియజేశాం. ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేద థామస్ హీరోయిన్స్ గా నటించనున్నారు.

హను సినిమా చివరి దశకు చేరుకోవడంతో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే నెక్స్ట్ మూవీని మొదలెట్టడానికి సిద్దమయ్యాడు. మాకు అందిన సమాచారం ప్రకారం నాని – ఇంద్రగంటి మోహన కృష్ణల సినిమా డిసెంబర్ 2న అధికారికంగా లాంచ్ కానుంది. అలాగే డిసెంబర్ 2వకా వారం నుంచే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ లవ్ స్టొరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఈ జానర్ సినిమా తెలుగులో ఇప్పటి వరకూ రాలేదని ఇటీవలే మోహనకృష్ణ తెలిపాడు. అవసరాల శ్రీనివాస్, రోహిణి, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు