వరుణ్ తేజ్ ‘ముకుంద’ మూవీ, ఆడియో రిలీజ్ డేట్స్

వరుణ్ తేజ్ ‘ముకుంద’ మూవీ, ఆడియో రిలీజ్ డేట్స్

Published on Nov 25, 2014 1:12 PM IST

Mukunda
మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాకి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ముందుగా ఈ సినిమాని 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు కానీ సంక్రాంతి బరిలో చాలా పెద్ద సినిమాలు ఉండడం వలన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికే ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది.

అందులో భాగంగా ‘ముకుంద’ ఆడియో రిలీజ్ మరియు మూవీ రిలీజ్ డేట్స్ ని మార్చింది. తాజా సమాచారం ప్రకారం ‘ముకుంద’ ఆడియో ని డిసెంబర్ 3న రిలీజ్ చెయ్యాలని, అలాగే సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం డిసైడ్ అయ్యింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు