అహ్మదాబాద్‌లో లొకేషన్స్ వేటలో మురుగదాస్!
Published on Sep 29, 2016 2:42 pm IST

murgudas
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైద్రాబాద్, చెన్నైలలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఇక ముందే చెప్పినట్లు పూణే, ముంబై, అహ్మదాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక అహ్మదాబాద్ షెడ్యూల్ కోసం తమ షూటింగ్‌కు అనువైన లొకేషన్స్ వేటలో దర్శకుడు మురుగదాస్ పడిపోయారు.

సినిమాటోగ్రాఫర్ సంతోష శివన్, మురుగదాస్, ఆయన డైరెక్షన్ టీమ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో లొకేషన్స్ వెతుకుతున్నారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‍గా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ మరో నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో విడుదల కానుంది.

 
Like us on Facebook