క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్దమవుతున్న మురుగదాస్ !

క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్దమవుతున్న మురుగదాస్ !

Published on Jun 25, 2017 1:14 PM IST


దక్షిణాది స్టార్ దర్శకుల్లో ఒకరైన మురుగదాస్ త్వరలో తన కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘స్పైడర్’ సినిమా చేస్తున్న ఆయన ఆ సినిమా ముగింపు దశలో ఉండటంతో విజయ్ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటి నుండి అనుకుంటున్న ఈ సినిమాపై కోలీవుడ్లో భారీ అంచనాలున్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈ ప్రాజెక్టులో ఎవరెవరు నటిస్తున్నారు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో విజయ్, మురుగదాస్ ల కలయికలో రూపొందిన ‘తుపాకి, కత్తి’ చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు