ముఠామేస్త్రి నిర్మాత ఇక లేరు..!

ముఠామేస్త్రి నిర్మాత ఇక లేరు..!

Published on Feb 25, 2017 12:31 PM IST


ప్రముఖ నిర్మాత కేసి శేఖర్ బాబు శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగులో పలు చిత్రాలను నిర్మించారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనిలో తన నివాసంలో మరణించారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.ఆ చిత్రాన్ని నిర్మించింది శేఖర్ బాబు కావడం విశేషం.

కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో శేఖర్ బాబు జన్మించారు. అయన తండ్రి సినీ డిస్ట్రిబ్యూటర్ కావడంతో సినిమారంగంలోకి అడుగుపెట్టారు.సూపర్ స్టార్ కృష్ణ , జమున కాంబినేషన్ లో వచ్చిన ‘మమత’ శేఖర్ బాబుకి నిర్మాతగా తొలి చిత్రం. ఆ తరువాత ఆయన సర్దార్, గోపాలరావు గారి అమ్మాయి, సంసారబంధం వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన సినీపరిశ్రమ అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు. ఫిల్మ్ సెంట్రల్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన పనిచేసారు. అయన మరణం సినిలోకాన్ని కలచివేసింది. చిరంజీవి మరియు ఇతర సినీప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలియజేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు