ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – చరణ్ తో నా కెమిస్ట్రీ ‘రంగస్థలం’ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఆది పినిశెట్టి – చరణ్ తో నా కెమిస్ట్రీ ‘రంగస్థలం’ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది !

Published on Oct 31, 2017 5:21 PM IST

హీరోగా సినిమా చేస్తూనే ప్రతినాయకుడి పాత్రల్లో కూడా మెప్పిస్తూ స్టార్ హీరోల సరసం మంచి మంచి పాత్రలు చేస్తున్న నటుడు ‘ఆది పినిశెట్టి’. హీరో ఇమేజ్ పొందడం కన్నా మంచి నటుడని గుర్తింపే కావాలని కోరుకునే ఈ యువ హీరో 123 తెలుగుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘నిన్ను కోరి’ చిత్రంలో మీ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
జ) స్రిప్ట్ వినగానే సినిమా బాగా వర్కవుట్ అవుతుందని అనిపించింది. సినిమాలో ప్రస్తుత జనరేషన్ కు కావాల్సిన మంచి మెసేజ్ ఉండటం వలన ఈ నేనీ సినిమా చేశాను. ‘సరైనోడు’ తర్వాత అందరూ నన్నో విలన్ లా చూసి ‘నిన్ను కోరి’ తర్వాత అభిమానించడం మొదలుపెట్టారు. అది నా భాద్యతను మరింతగా పెంచింది.

ప్ర) పవన్ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?
జ) ఆ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. సినిమాలో నాది పూర్తి నెగెటివ్ రోల్ కాదు. నా ఆలోచనల్ని నేను నమ్ముతుంటాను. త్రివిక్రమ్ గారు ఆ పాత్రను రాసిన విధానం చూస్తే అది నా కెరీర్లోని బెస్ట్ రోల్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అనిపిస్తోంది.

ప్ర) పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వారు. ఆయనతో వర్క్ చేయడం గొప్ప అనుభవం. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఎక్కడా గర్వం, స్టార్ డమ్ చూపించరు. ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ఆయన్నుండి నేర్చుకోవలసింది చాలానే ఉంది.

ప్ర) మీరు సినిమాల్ని ఒప్పుకునేప్పుడు ఏయే అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటారు ?
జ) నాకెలాంటి ఆలోచనలూ ఉండవు. నేనిక్కడికి పని చేయడానికి వచ్చాను. అన్ని రోల్స్ చేస్తాను. చెప్పలాంటే అదే నన్నిక్కడికి తీసుకొచ్చింది. అందుకే చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అందరూ నేను ఏ పాత్రనైనా చేయగలనని నమ్ముతున్నారు. ఒక నటుడికి అంతకన్నా సంతోషం కలిగించే విషయం మరొకటి ఉండదు.

ప్ర) ఒకసారి బేగెటివ్ రోల్స్ చేస్తే మళ్ళీ మళ్ళీ అలాంటి పాత్రలే వస్తాయని మీరనుకోలేదా ?
జ) అది పాత ఉద్దేశ్యం. కొన్ని సంవత్సరాల నుండి పరిస్థితులు మారిపోయాయి. ‘అర్జున్ రెడ్డి’ ఐదేళ్ల క్రితం విడుదలై ఉంటే వర్కవుట్ అయ్యేది కాదు. పాత్ర మంచిదై, అందులో బాగా నటిస్తే ఏ పాత్రైనా చేయొచ్చు. ‘సరైనోడు’ తర్వాత ‘నిన్ను కోరి’ ఒప్పుకోవడానికి కూడా అదే కారణం.

ప్ర) తెలుగు, తమిళ సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?
జ) నేను ఎక్కడా ప్రూవ్ చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎక్కువ బైలింగ్యువల్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. నా లక్ష్యం ఏమిటంటే నేను చేసే పాత్రల్లో ఏ రెండు పాత్రలూ ఒకలా ఉండకూడదు.

ప్ర) ‘రంగస్థలం’ లో చేస్తున్నారు కదా అందులో ఎలాంటి పాత్ర ?
జ) దర్శకుడు సుకుమార్ సినిమాను చాలా గొప్పగా తీస్తున్నారు. ఇందులో నాలోని మరొక యాంగిల్ కనిపిస్తుంది. రామ్ చరణ్ తో నా కెమిస్ట్రీ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

ప్ర) ఎప్పుడూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూంటారెందుకు ?
జ) చెప్పాలంటే నాకు సిగ్గెక్కువ. అందుకే పెద్దగా బయట కనబడను. నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కువగా వాళ్ళతోనే గడుపుతాను. చరణ్, నానీలు నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే మనోజ్ నేను కలిసే పెరిగాం. వాళ్ళతోనే ఎక్కువగా ఉంటాను.

ప్ర) ఇక మీ పెళ్ళెప్పుడు ?
జ) (నవ్వుతూ) త్వరలోనే జరుగుతుంది. అమ్మాయిని వెతుకుతున్నారు. ఆ శుభవార్త నేనే స్వయంగా చెబుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు