ఇంటర్వ్యూ : నాగార్జున – మాకు అభిమానులే పెద్ద వరం !

ఇంటర్వ్యూ : నాగార్జున – మాకు అభిమానులే పెద్ద వరం !

Published on Aug 28, 2017 1:48 PM IST


ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతూ, పరిశ్రమలో వస్తున్న కొత్త ట్రెండ్స్ ను అందిపుచ్చుకుంటూ ప్రయోగాత్మక సినిమాలతో అభిమానుల్ని అలరిస్తున్న సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున. రేపు ఆగష్టు 29న పుట్టినరోజు సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ ‘రాజుగారి గది-2’ ఎంతవరకు వచ్చింది ?
జ) అంతా పూర్తయిపోయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలుంది. రీ రికార్డింగ్ జరుగుతోంది. వచ్చే నెల రెండవ వారంలో మొదటి కాపీ రావాలి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఎన్నాళ్లగానో హర్రర్ కామెడీ జానర్లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా. అది ఈ సినిమాతో సాధ్యపడింది. ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నాది మెంటలిస్ట్ పాత్ర. మనిషిని చూడగానే వాళ్ళ మనసులో మాటల్ని కనిపెట్టగల పవర్స్ నాకుంటాయి. నా పాత్రలో పెద్దగా కామెడీ ఉండదు. కానీ డ్రామా ఎక్కువగా ఉంటుంది.

ప్ర) ఓంకార్ తో కలిసి పనిచేయడం ఎలా ఉంది ?
జ) ఓంకార్ చాలా ఖచ్చితమైన దర్శకుడు. చిన్న చిన్న లోపాల్ని కూడా వదలడు. అతనికి ప్రతి సీన్ అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా రావాలి. అలా వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. అతని పనిచేయటం చాలా బాగుంది. కథ చేప్పేటప్పుడే ఫుల్ స్క్రిప్ట్ తో నా దగ్గరికి వచ్చాడు.

ప్ర) మీ అబ్బాయిల సినిమాలని మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా ప్రెజర్ అనిపించడంలేదా ?
జ) అంటే అక్కడ కొంచెం ప్రేమ ఉంటుంది కదా. ప్రెజర్ కూడా ఉంటుంది. అఖిల్ సినిమా కొంచెం కాంప్లికేట్ గా ఉంటుంది. అంటే బడ్జెట్ ఎక్కువ. జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అయినా కూడా వాళ్ళ సినిమాల్ని నేను నిర్మించడం ఆనందంగా ఉంది.

ప్ర) అఖిల్ సినిమా మరీ ఎందుకింత ఆలస్యమైంది ?

జ) హీరోయిన్ ను సెలక్ట్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాం. సినిమా ఫ్రెష్ లవ్ స్టోరీ. కాబట్టి హీరోయిన్ కూడా కొత్తగా ఉండాలని అంటే గీతాంజలిలో గిరజలా, ఏమాయ చేసావే లోసమంతలా ఉండాలని అనుకున్నాం. చాలా మందిని ఆడిషన్స్ చేశాం. చివరికి కళ్యాణి ప్రియదర్శినిని సెలెక్ట్ చేశాం.

ప్ర) మీ సినిమాల్ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా ?
జ) ఇంకా ఏం అనుకోలేదు. గతంలో న 5, 6 సినిమాలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశాం. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే నాకు నమ్మకం తక్కువ. ముందు తెలుగులో చేసి ఆ తర్వాత చూద్దామని అనుకుంటున్నాను.

ప్ర) ‘బంగార్రాజు’ ఎంతవరకు వచ్చింది ?
జ) నాక్కూడా ఆ పాత్ర చేయాలని చాలా కోరిక. కళ్యాణ్ కృష్ణ ఒక లైన్ చెప్పాడు కానీ అది నచ్చలేదు. అతను మంచి కథ చెప్తే చేసేస్తాను. కానీ అది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కు సీక్వెల్ లా ఉండకూడని మాత్రం అనుకుంటుంన్నాను.

ప్ర) మలయాళం మహాభారతంలో నటిస్తున్నారట నిజమేనా ?
జ) వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయిన మాట నిజమే కానీ చేస్తానా చేయనా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. అందులో కర్ణుడి పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ ప్రాజెక్ట్ 2018లో మొదలవుతుంది.

ప్ర) చైతన్య – సమంతల పెళ్ళికి ఎలా ప్లాన్ చేస్తున్నారు ?
జ) అక్టోబర్ 6న చేయాలని అనుకుంటున్నాం. ఆరోజే క్రిస్టియన్, హిందూ పద్దతిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి వేడుకను చిన్నదిగా చేద్దామని వాళ్ళే అన్నారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని మాత్రం గ్రాండ్ గా ఉండేలా నేనే ప్లాన్ చేస్తున్నాను.

ప్ర) ఈ పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ?
జ) వాళ్ళ ప్రేమకు నా కృతజ్ఞతలు. అంతకన్నా వాళ్లకు ఇంకేం చెప్పగలను. నాన్నగారి దగ్గరనుండి ఇప్పటి వరకు అన్ని సమయాల్లోనూ వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు. వాళ్ళ ఆదరణ మర్చిపోలేనిది. వాళ్ళే మాకు పెద్ద వరం. ఎప్పుడైన పరిస్థితులు బాగోలేనప్పుడు వాళ్ళతో మాట్లాడగానే అంతా చక్కబడిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు