ఇంటర్వ్యూ : శ్రీ దివ్య – ’రాయుడు’ లో నాది చాలా బోల్డ్ అండ్ పవర్ఫుల్ పాత్ర..!

ఇంటర్వ్యూ : శ్రీ దివ్య – ’రాయుడు’ లో నాది చాలా బోల్డ్ అండ్ పవర్ఫుల్ పాత్ర..!

Published on May 26, 2016 6:52 PM IST

Sree-Divya
బాలనటిగా సినీరంగప్రవేశం చేసిన శ్రీ దివ్య ఆ తరువాత కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత ’మనసారా’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తరువాత ’బస్ స్టాప్’, ’కేరింత’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ తరువాత తెలుగులోకంటే ఎక్కువగా తమిళ్ సినిమాలలోనే నటించింది. తమిళ్ లో విశాల్ సరసన ఆమె నటించిన ’మరుదు’ సినిమా రేపు తెలుగులో ’రాయుడు’ గా విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు :

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో విలేజ్ అమ్మాయిగా నటిస్తున్నా. నా పాత్రపేరు భాగ్యలక్ష్మి. చాలా బోల్డ్ అండ్ పవర్ఫుల్ గా ఉండే పాత్ర. హీరోతో సమానంగా ఉంటుంది.

ప్రశ్న) విశాల్ తో పనిచేయడం ఎలా ఉంది?
స) మరచిపోలేని అనుభవం. మొదటిసారి ఆయనతో నటించేటప్పుడు భయపడుతూనే ఉన్నా కానీ పరిచయం అయ్యాక ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. విశాల్ తమిళ్ లో పెద్ద స్టార్ అయినా అందరితో ఒకేలాగా ఉంటారు.

ప్రశ్న) మీరు అక్కడ ఏదో విరాళం ప్రకటించారని విన్నాం. దాని గురించి చెప్పండి?
స) మేము ’రాయుడు’ సినిమాని మదురైలోని రాజపాళ్యం అనే టౌన్‌లో చిత్రీకరించాం. అక్కడ ఒక స్లమ్ ఏరియా ఉంది. అక్కడ ఆడవాళ్లకి పబ్లిక్ టాయిలెట్స్ లేవు. అక్కడ విషయం తెలుసుకున్న ’రాయుడు’ టీమ్ మొత్తం విరాళాలు ఇచ్చింది. నేను కూడా పది టాయిలెట్స్ కట్టించడానికి విరాళం ఇచ్చా.

ప్రశ్న) తమిళ్ లో ఎందుకు నటించాలనుకుంటున్నారు?
స) నాకు మొదటినుంచీ తమిళ్ సినిమాలంటే ఇష్టం. అక్కడ ఉన్న నేటివిటీ కానీ పాత్రలను తీర్చిదిద్దేవిధానం కానీ నచ్చి మొదటినుంచీ తమిళ్ సినిమాలను ఫాలో అయ్యేదాన్ని. నాకు కూడా అక్కడ నుంచే నా మ‌న‌సుకు న‌చ్చిన పాత్ర‌లు వస్తుండటంతో త‌మిళంలో న‌టిస్తున్నా. కానీ నేను నటిస్తున్న అన్ని సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతుండటంతో తెలుగులో నటించడం లేదు అన్న బాధ లేదు.

ప్రశ్న) ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
స) దర్శకుడు ముత్తయ్య గారు హైదరాబాద్ కి వచ్చి ఈ కథ చెప్పారు. నాకు నా పాత్రే కాదు అన్ని పాత్రలు కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.

ప్రశ్న) ఈ సినిమా కథ గురించి చెప్పండి?
స) తమిళనాడు లో ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ఈ సినిమాలో ఉన్న ఎసెన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. (నవ్వుతూ) అంతవరకే చెప్పగలను.

ప్రశ్న) దర్శకుడు ముత్తయ్య గురించి చెప్పండి?
స) ఆయనకు తెలుగు కొద్దిగా కూడా రాదు. కానీ ప్రతి పాత్రనీ ఆయన నటించి చూపిస్తారు. నేను పూర్తిగా ఆయన్ని ఫాలో అయ్యాను అంతే.

ప్ర) తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదు…?
స) (నవ్వుతూ) మంచి కథలు నా దగ్గరికి రావడం లేదు. ’కేరింత’ తరువాత నాకు మంచి అవకాశాలు రాలేదు.

ప్రశ్న) సినిమా అవకాశాలను ఎలా తీసుకుంటారు?
స) మొదట దర్శకుడిని దృష్టిలో పెట్టుకుంటాను. తరువాత నా పాత్రకున్న ప్రాముఖ్యత తెలుసుకుంటా. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని సినిమా చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటా.

ప్రశ్న) మీ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
స) నా తరువాత సినిమా ’కాశ్మోరా’. జీవాతో కూడా ఓ సినిమా చేస్తున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు