‘నా బంగారు తల్లి’ నిర్మాతకి అరుదైన పురష్కారం

‘నా బంగారు తల్లి’ నిర్మాతకి అరుదైన పురష్కారం

Published on Nov 25, 2014 9:00 AM IST

NAA-BANGAARU-TALLI-Producer
61వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ అందుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. అలాగే ఇండోనేషియన్, ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో కూడా అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాకి ఇప్పటి వరకూ వచ్చిన అవార్డ్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు మరో అరుదైన అవార్డు దక్కింది. అది కూడా ఈ చిత్ర నిర్మాత డా. సునీత కృష్ణన్ కి రావడం విశేషం. సునీతకి సౌత్ ఆఫ్రికా వారు నెల్సన్ మండేలా – గ్రాకా మచేల్ అవార్డు ని బహుకరించారు. సౌత్ ఆఫ్రికా లో ప్రసిద్ది గాంచిన అవార్డును గెలుగుకున్న మొట్ట మొదటి ఏషియన్ గా సునీత కృష్ణన్ రికార్డ్ సాధించింది. అంజలి పాటిల్, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి రాజేష్ టచ్ రైవర్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు