ఆలస్యమైన సినిమాలన్నీ ఒకే రోజు వస్తున్నాయి !

ఆలస్యమైన సినిమాలన్నీ ఒకే రోజు వస్తున్నాయి !

Published on May 22, 2018 8:26 PM IST


తెలుగలో ఈనెల 25న విడుదలకావలసిన సినిమాలు కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 1న రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో మొదటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘ఆఫీసర్’. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవ్వాల్సి ఉండగా చిత్రానికి సంబంధించి పెండింగ్ వర్క్ ఉండడం వలన ఈ సినిమా జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తరువాతి సినిమా నందమూరి కళ్యాణ్ రామ్, తమ్మన్న జంటగా తెరకెక్కిన ‘నా నువ్వే’ . ఈ సినిమా కూడా ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా వాయిదాపడి జూన్ 1న రిలీజ్ కానుంది. దీని తరువాత రాజ్ తరుణ్ నటించిన ‘రాజు గాడు’ మూవీ కూడా జూన్ 1న విడుదల కానుంది.

అలాగే తమిళంలో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీని తెలుగు అనువాదం’అభిమన్యుడు’ కూడ పలుసార్లు వాయిదాపడి చివరికి జూన్ 1న రానుంది. ఇలా వివిధ కారణాల వలన వాయిదాలుపడిన నాలుగు సినిమాలు ఒకేరోజు జూన్ 1న విడుదలకానుండటం విశేషం. ఇక ఈ వారం రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, నాగశౌర్య నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రాలు రిలీజవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు