పోరాట సన్నివేశాల చిత్రీకరణలో అల్లు అర్జున్ !

పోరాట సన్నివేశాల చిత్రీకరణలో అల్లు అర్జున్ !

Published on Nov 19, 2017 10:09 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. దేశభక్తి నైపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోనే రెండు షెడ్యూళ్లను, ఊటీలో ఒక షెడ్యూల్ ను ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో కీలకమైన పోరాట స్నానివేశ్లని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ రవి వర్మ ఈ ఫైట్ సీన్స్ ను కంపోజ్ చేస్తున్నారు.

శిరీష్ , శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్ ఖచ్చితమైన లుక్ కోసం యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు