ఆలు అర్జున్ కొత్త సినిమా టైటిల్ అదేనా ?


స్టార్ హీరో అల్లు అర్జున్ తరువాత చేయబోయే సినిమాల్లో ఒకదానికి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే ఆసక్తికరమైన టైటిల్ నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్ర షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న బన్నీ అది పూర్తవగానే లింగుస్వామి డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని చేయనున్నారు. దీంతో పాటే ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలవుతుందట.

ఈ ప్రాజెక్టును వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తాడట. రచయితగా ‘టెంపర్, రేసు గుర్రం, కిక్’ వంటి కమర్షియల్ హిట్ చిత్రాలకు పనిచేసిన ఈయన గతంలో ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో అది కుదరక ప్రస్తుతం తన మొదటి సినిమాని బన్నీతో తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అలాగే చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నాడట. అయితే ఈ విషయంపై సంబంధిత వ్యక్తుల దగ్గర్నుండి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు.

 

Like us on Facebook