బెంగుళూరులో నాగ చైతన్య ప్రేమాయణం

బెంగుళూరులో నాగ చైతన్య ప్రేమాయణం

Published on May 22, 2015 8:26 AM IST

Naga-Chaitanyas-first-look
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఏమాయ చేసావే’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి డైరెక్టర్ గౌతమ్ మీనన్. దాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుంది. ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన జోడీ కట్టనుంది. ప్రస్తుతం నాగ చైతన్య ప్రేమాయణం బెంగుళూరులో జరుగుతోంది. అక్కడ నాగ చైతన్య, మంజిమ మోహన్, మిగిలిన ప్రముఖ నటీనటులపైన కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. మెయిన్ గా చైతన్య – మంజిమ మోహన్ పై వచ్చే కొన్ని కీలకమైన లవ్ సీన్స్ ని బెంగుళూరు లో షూట్ చేస్తున్నారు.

ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. తమిళ వెర్షన్ లో కూడా మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ‘అచ్చం ఎన్బదు మదమైయద’ అనే టైటిల్ ని పెట్టిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు