అభిమానులకు ఉగాది కానుక ఇవ్వనున్న నాగ చైతన్య !

అభిమానులకు ఉగాది కానుక ఇవ్వనున్న నాగ చైతన్య !

Published on Mar 22, 2017 3:13 PM IST


‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లు ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్న నాయాన’ లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగ చైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్ లో చూపించనున్నాడు. నాగ చైతన్య ఇంతకు ముందులా కాకుండా నటనలోనే, బాడీ లాగ్వేజ్ లోనూ పూర్తిగా స్టైల్ మార్చి పరిణితి కలిగిన నటనను ప్రదర్శిస్తుండంతో ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఉత్సుకత కాస్త ఎక్కువైంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈ మార్చి నెల 29వ తారీఖున ఉగాది సందర్బంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అన్నపూర్ణ స్యుడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ ప్రస్తావనలో ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకులను అందించాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు అక్కినేని టీమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు