నాగ శౌర్య కొత్త సినిమా వివరాలు !

నాగ శౌర్య కొత్త సినిమా వివరాలు !

Published on Mar 23, 2018 8:32 AM IST

ఐరా క్రియేషన్స్ తెరకెక్కించిన ఛలో చిత్రంతో విజయం అందుకున్న నాగశౌర్య ఇదే సంస్థలో చెయ్యబోతున్న రెండో సినిమా నర్తనశాల. ఉగాదిని పురస్కరించుకొని ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఉషా ముల్పూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 12 నుండి ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో మెహరిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. డాన్స్ నేపద్యంలో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘ఛలో’ సినిమాకు సంగీతం అందించిన సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు. నాగ శౌర్య ఈ సినిమా తరువాత కాశి విశ్వనాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు