నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ శౌర్య..?

నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ శౌర్య..?

Published on Nov 26, 2014 8:28 PM IST

Nag-souriyam-nadini-reddy
‘అలా మొదలైంది’ అంటూ తెలుగు చిత్రసీమలో దర్శకురాలిగా తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు నందిని రెడ్డి. తొలి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అయితే రెండవ సినిమా ‘జబర్దస్త్’ పరాజయం పాలవడంతో ఏడాది పాటు మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం మూడవ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న నాగ శౌర్య ఈ సినిమాలో నటిస్తారని సమాచారం. ఇటివలే నందిని రెడ్డి స్క్రిప్ట్ వినిపించారట. నందిని రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేసిన దామోదర ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకూడదని సుమారు ఏడాది పాటు నందిని రెడ్డి ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు