షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ శౌర్య కొత్త చిత్రం !

షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ శౌర్య కొత్త చిత్రం !

Published on Jul 26, 2017 3:50 PM IST


గతేడాది ‘జ్యో అచ్యుతానంద’ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగ శౌర్య ఈ సంవత్సరం బాక్సాఫిస్ ముందు ఇంకా ఖాతా తెరవలేదు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పూర్తయింది కూడా తెలుగు వెర్షన్ తాలూకు చిత్రీకరణే. ఇకపోతే ఈ చిత్రంలో నాగ శౌర్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. నాగ శౌర్య ఈ సినిమా కాకుండా వెంకీ కుడుములు దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు