మా తమ్ముడు కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడు – నాగబాబు

మా తమ్ముడు కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడు – నాగబాబు

Published on Apr 18, 2018 12:51 PM IST

కాస్టింగ్ కౌచ్ ద్వారా అన్యాయం జరిగిందంటూ పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి, ఇతరులు పరిశ్రమపై, పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఇప్పటికే అభిమానులు, అనేక మంది సినీ ప్రముఖులు స్పందించగా ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు కూడ మాట్లాడారు.

మా అసోసియేషన్ లోని సభ్యులకు పాత్రలు ఇప్పిస్తామని గ్యారెంటీ ఇవ్వదన్న నాగబాబు వయసులో పెద్దవారైన నటులకు పెన్షన్, సభ్యులందరికీ రూ.2 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో సౌకర్యాలను మా కల్పిస్తోందని, అలాగే నటులకు, నిర్మాతలకు, దర్శకులకు మధ్యన ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుందని అన్నారు.

అలాగే ఇండస్ట్రీలో ఇతర భాషలవారు పనిచేయకూడదనేది ప్రాధమిక హక్కుని ఉల్లఘించడమేనని, ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చని, కానీ తెలుగమ్మాయిలకు ఎక్కువ అవకాశం ఉండేలా చూడమని తాము కూడ నిర్మాతల్ని, దర్శకుల్ని కోరతామని హామీ ఇచ్చారు. ఇక కాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనన్న ఆయన ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించడం భావ్యం కాదని, పరిశ్రమలోని అమ్మాయిలకు అన్ని సౌకర్యాలతో కూడిన వాతావరణం ఉండే దిశగా పనిచేస్తామని మీడియా కూడ టీఆర్ఫీల కోసం కాకుండ మంచిని మంచిగా, చెడును చచెడుగా చూపిస్తూ ప్రజలకు ఉపయోగపడాలని కోరారు.

ఇక చివరగా పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన ఆయన అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయమని పవన్ అనడంలో తప్పేముంది, ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే కళ్యాణ్ బాబు ఏం చేస్తాడు, ఇంతకుముందే ఇలాంటి వాటిపై స్పందించవద్దని, ఇంతకంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని, వాటిపై పోరాడాలని పవన్ ఫ్యాన్స్ కు చెప్పాడు. ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. తప్పు చేస్తే బహిరంగంగా ఒప్పుకునే ధైర్యం కళ్యాణ్ బాబుకి ఉంది. కోట్ల రూపాయలొచ్చే సినిమాల్ని వదిలేసి మా మాట కూడ వినకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే మాకు మద్దతుగా ఎంతో మంది ఆడవాళ్లు రెస్పాండ్ అయ్యారు. కానీ మేము కాలేదు. ఎందుకంటే మేము బలవంతులం. మాకు భరించే శక్తి ఉంది. మా మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దు. ఇకపై మెగా ఫ్యామిలీని అనవసరంగా టార్గెట్ చేస్తే ఊరుకునేదిలేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించడం మంచింది అంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు