రష్మిక నిర్ణయం కోసం నాగ చైతన్య వెయిటింగ్ అట.

రష్మిక నిర్ణయం కోసం నాగ చైతన్య వెయిటింగ్ అట.

Published on Oct 18, 2019 1:32 AM IST

టాలీవుడ్ కి పరిచయమైన కొద్దికాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ రష్మిక మందాన. చలో, గీతగోవిందం వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీనితో స్టార్ హీరోలైన మహేష్ మరియు అల్లు అర్జున్ చిత్రాలలో కూడా అవకాశం దక్కించుకుంది. కాగా టాలీవుడ్ ఏస్ నిర్మాత దిల్ రాజు, నాగచైతన్య రష్మిక మందాన లతో ఒక మూవీ చేయాలని చూస్తున్నారట. కొత్త దర్శకుడు శశి ఈ మూవీ స్క్రిప్ట్ ని ఇప్పటికే రెండు సార్లు ఆమెకు వినిపించినా కూడా సంతృప్తి పడలేదట. ఆమె స్క్రిప్ట్ ఒకే చేస్తే మూవీ మొదలు పెడదాం అని చైతు, దిల్ రాజు ఎదురుచూస్తున్నారట.

మరి వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఏమి చేస్తుందో చూడాలి. రష్మిక తెలుగులో నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న భీష్మ, మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా, అల్లు అర్జున్ – సుకుమార్ ల చిత్రం మొదలుకావాల్సివుంది. ఇవికాక తమిళంలో కార్తీ సుల్తాన్ మరియు మరో కన్నడ చిత్రంలో రష్మిక చేస్తున్నారు. ఇక నాగ చైతన్య వెంకీమామ, అలాగే శేఖర్ కమ్ముల చిత్రాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు