అఖిల్ కొత్త చిత్రం మొదలయ్యేది ఎప్పుడో ప్రకటించిన నాగార్జున !

అఖిల్ కొత్త చిత్రం మొదలయ్యేది ఎప్పుడో ప్రకటించిన నాగార్జున !

Published on Feb 19, 2017 12:25 PM IST


అక్కినేని యువ హీరో అఖిల్ తన రెండవ చిత్రం కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు నాగార్జున. కావాల్సినంత గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి తమ కుటుంబానికి మర్చిపోలేని క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. మొదట్లో విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చక రెండవ కథ విన్న నాగార్జున ఆ కథను ఓకే చేశారు.

అయితే ఇన్నాళ్లు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలీక కాస్త కన్ఫ్యూజన్లో ఉన్న అభిమానుల కోసం సినిమా ప్రారంభం ఎప్పుడో ప్రకటించారు నాగార్జున. ఈ చిత్రాన్ని మార్చి నెలలో మొదలుపెడతారని ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్లో ప్రకటించారు. అఖిల్ కెరీర్లో రీలాంచ్ గా పరిగణింపబడుతున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ మేఘా ఆకాష్ నటించనుండగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు