Like us on Facebook
 
చలపతిరావ్ కామెంట్స్ పై సీరియస్ గా స్పందించిన నాగార్జున !


రెండు రోజుల క్రితం జరిగిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావ్ ఉద్దేశించి చేసిన అభ్యంతరకర కామెంట్స్ సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం రేపాయి. అంత సీనియర్ నటుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన సినీ ప్రముఖులు ఖండించగా తాజగా అక్కినేని నాగార్జున కూడా కాస్త సీరియస్ గానే స్పందించారు.

తాను వ్యక్తిగతంగాను, తన సినిమాల్లోనూ మహిళలను గౌరవిస్తానని చెప్పిన నాగ్ చలపతిరావ్ మాటల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలోని పలు మహిళా సంఘాలు, మహిళా నేతలు సైతం చలపతిరావ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండగా చలపతిరావ్ మాత్రం తాను ఎలాంటి దురుద్దేశ్యంతోను ఆ మాటలు అనలేదని, ఒకవేళ అమ్మాయిల మనసుల్ని నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని, అనవసరంగా తన మాటలకు ద్వందార్థాలు తీసి నానా రాద్ధాంతం చేస్తున్నారని మీడియా ఛానెల్ కు వివరించారు.

Bookmark and Share