తమిళ్ లో విడుదల కానున్న నాగార్జున సినిమా !

తమిళ్ లో విడుదల కానున్న నాగార్జున సినిమా !

Published on Dec 16, 2017 1:04 PM IST

అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడిసాయి సినిమాల తరువాత రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓం నమో వెంకటేశాయ. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను కె.రాఘవేంద్రరావుగారు ఈ చిత్రం ద్వారా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా తమిళ్ లో విడుదల కానుంది.

డిసెంబర్ 29 న ఈ చిత్రాన్ని డబ్ చేసి తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. నాగార్జున ఈ మూవీ లో హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం కనపరిచాడు. భక్తుడి పాత్రలకు తాను ఒదిగిపోయిన విధానం తో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ఈ చారిత్రక భక్తిరస చిత్రం అక్కడ కూడా మంచి విజయం సాదిస్తుందని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు