నిఖిల్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్ !

నిఖిల్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్ !

Published on Oct 22, 2016 10:56 AM IST

isha-kopikal
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తన ‘స్వామి రారా’ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘కేశవ’ అనే టైటిల్ ను కూడా నిర్ణయించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నిఖిల్ సరికొత్తగా కనిపంచనున్నాడని వినికిడి. అలాగే ఈ సినిమాకి మరో విశేషం కూడా ఉంది. ఒకప్పుడు నాగరాజును సరసన హీరోయిన్ గా నటించిన ‘ఇషా కొప్పికర్’ ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. 1998 లో నాగార్జున హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘చంద్రలేఖ’ సినిమాలో ఇషా కొప్పికర్ హీరోయిన్ గా నటించింది.

చివరగా ఈమె తెలుగులో 2001 లో వెంకటేష్ సినిమా ‘ప్రేమతో రా’ లో మెరిసి ఆ తరువాత బాలీవుడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు నిఖిల్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఈమె కథకు కీలకమైన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని సుధీర్ వర్మ తెలిపాడు. రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు