హోం బ్యానర్లో నాగార్జున ‘బంగార్రాజు’

హోం బ్యానర్లో నాగార్జున ‘బంగార్రాజు’

Published on Feb 9, 2016 1:08 PM IST

nagarjuna
నువ్వా నేనా అంటూ సాగిన సంక్రాంతి బరిలో రిలీజై అన్నిటికంటే భారీ విజయాన్ని అందుకున్న సినిమా సినిమాగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నమోదైంది. ఈ సినిమా నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది, అలాగే పెట్టినదానికి డబుల్ పైనే కలెక్ట్ చేసి నిర్మాత అయిన నాగార్జునకి, అటు బయ్యర్స్ కి భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. నాగార్జున ద్విపాత్రాభినయంలో చేసిన ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర సినిమాకి చాలా కీలకం. అలాగే బంగార్రాజు పేరు మరియు ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది.

దాంతో ఈ బంగార్రాజు అనే పాత్రతో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఇది వరకూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి న్యూస్ లేదు. కానీ నాగ్ మాత్రం ఆ బంగార్రాజు అనే పేరు క్రియేట్ చేసిన మేజిక్ ని ఉపయోగించుకోవాలని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ‘బంగార్రాజు’ ఆనే టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేసాడు. ప్రస్తుతానికి టైటిల్ రిజిష్టర్ చేసినా ఈ టైటిల్ కి తగ్గట్టుగా సోగ్గాడే కి సీక్వెల్ చేయాలా లేక వేరే కథ చేయాలా అనే ఆలోచన జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. కానీ బంగార్రాజు అనే టైటిల్ మాత్రం అప్పుడే చాలా మందికి రీచ్ అయిపొయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు