చైతన్య సినిమాపై వస్తున్న రూమర్లను కొట్టిపడేసిన నాగార్జున !
Published on Jul 2, 2017 4:58 pm IST


‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు పుట్టుకొచ్చాయి. పైగా ఈ సినిమా కోసం నాగార్జున బోయపాటికి రూ. 12 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని కూడా గుస గుసలు వినబడ్డాయి. కానీ వీటిలో ఎంత మాత్రం నిజం లేదని నాగార్జున తేల్చిపారేశారు.

కొద్దిసేపటి క్రితమే ఈ వార్త నిజం కాదని ఆయన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ప్రస్తుతం కృష్ణ అర్వి మరిముత్తు డైరెక్షన్లో ‘యుద్ధం శరణం’ సినిమా చేస్తున్న చైతన్య తన తరవాతి సినిమాని ‘ప్రేమమ్’ తో తనకు మంచి సక్సెస్ ఇచ్చిన చందూ మొండేటి డైరెక్షన్లో చేయనున్నారు. ఇకపోతే నాగార్జున ‘రాజుగారి గది 2’ లోను మరొక అక్కినేని హీరో అఖిల్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలోను నటిస్తున్నారు.

 
Like us on Facebook