యాక్షన్ సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరిపోతున్న నాగార్జున !

సీనియర్ స్టార్ హీరో నాగార్జున గత కొన్నేళ్లుగా పంథాను మార్చి రెగ్యులర్ కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్లను పక్కనబెట్టి ఫ్యామిలీ, ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాల్ని మాత్రమే చేస్తూ వచ్చారు. ఆ ప్రయాణంలో మంచి సక్సెస్ లను కూడా అందుకున్నారాయన. దీంతో అభిమానులు, ప్రేక్షకులు అయన ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తారని అనుకుంటున్న తరుణంలో మనసు మార్చుకున్నారు నాగ్.

వరుసగా ఫ్యామిలీ, ఎమోషనల్ సినిమాలను చేసిన ఆయన తర్వాత ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయాలని ఆశపడుతున్నారు. అది కూడా తనకు ‘శివ’ లాంటి క్లాసిక్ ను అందించిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కావడం విశేషం. వర్మ ఇప్పటికే కథను సిద్ధం చేసి నాగార్జునకు వినిపించారు. వర్మ చెప్పిన కథతో థ్రిల్ అయిన నాగ్ వెంటనే సినిమాకు ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం హాలీడేకు వెళ్ళబోతున్న ఆయన తిరిగిరాగానే ఈ సినిమా పనుల్ని ప్రారంబిస్తారట.

 

Like us on Facebook