నవంబర్ లో నాగ్ కొత్త సినిమా కబుర్లు !

నవంబర్ లో నాగ్ కొత్త సినిమా కబుర్లు !

Published on Oct 21, 2019 6:05 PM IST

అక్కినేని నాగార్జున ‘బిగ్ బాస్’ హోస్ట్ గా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక నాగ్ తన కొత్త సినిమాలను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నాగ్ సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడా ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే.

కాగా డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట. అలాగే నాగ్ మరో హిందీ సినిమాని కూడా రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో తన కొత్త సినిమాలను అధికారికంగా నాగ్ ప్రకటించనున్నారు. ఇక బంగార్రాజు సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించనుంది. డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టి, వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజుని విడుద‌ల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు