శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో నాగార్జున.?

శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో నాగార్జున.?

Published on Oct 31, 2014 1:45 AM IST

nagarjuna-srini
‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయిన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో డైరెక్టర్ గా మారిన శ్రీని అవసరాల మొదటి సినిమాతో మంచి మార్కులే కొట్టేసాడు. ఈ సినిమా విజయంతో శ్రీని అవసరాలకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం శ్రీని అవసరాల నాగార్జునకి ఓ కథని చెప్పాడు. ప్రసతుతం నాగార్జున ఈ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. నాగార్జున శ్రీని అవసరాల స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ నాగార్జున ఓకే చేస్తే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది వరకే చెప్పినట్టు శ్రీని అవసరాల రెండవ సినిమాని కూడా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. ఇక నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే బాలన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు