చిక్‌మంగళూరులో నాగార్జున సినిమా

చిక్‌మంగళూరులో నాగార్జున సినిమా

Published on Aug 16, 2016 10:32 AM IST

om-namo-venkatesaya
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఓం ‘నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఆగష్టు 20వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందని టీమ్ తెలిపింది. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నాగార్జున, ఓం నమో వెంకటేశాయ, ఆ స్థాయిని మరింత పెంచేదిగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు