తమిళంలో రిలీజ్ కానున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ !

తమిళంలో రిలీజ్ కానున్న నాగార్జున సూపర్ హిట్ మూవీ !

Published on Jan 17, 2017 9:11 PM IST

Nagarjuna
అక్కినేని నాగార్జున కెరీర్లోని బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. 2016 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించి నాగార్జున చేస్తున్న భిన్నమైన ప్రయోగాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో సైతం రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రానికి జాన్ పీటర్ సంగీతం అందించగా, మైఖెల్ యాగప్పన్ మాటలు అందించారు.

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్య కృష్ణ, అనుష్క, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించారు. ఒక ఊరిలో జమీందార్ అయిన బంగార్రాజు ఆత్మ చుట్టూ నడిచే కథగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఓంకార ఫిలిమ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘సొక్కాలి మైనర్’ పేరును నిర్ణయించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు