‘నక్షత్రం’ ఆడియో డేట్ ఫిక్సైంది !
Published on Jul 4, 2017 3:00 pm IST


సీనియర్ స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. వరుస పరాజయాల తర్వాత ఈసారి ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పించాలన్న ఉద్దేశ్యంతో కృష్ణవంశీ చేస్తున్న ఈ సినిమాలో ధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజినా, ప్రగ్య జైస్వాల్ లు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్స్ కూడా మంచి ఆదరణ పొందడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది.

ఇక చిత్రీకరణ మొదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద అప్డేట్ ఇవ్వని చిత్ర టీమ్ తాజాగా ఆడియో విడుదల తేదీని ప్రకటించింది. ఈ కార్యక్రమం జూలై 5వ తేదీ అనగా రేపు సాయంత్రం 6 : 30 లకు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క విడుదల తేదీని రేపు జరగబోయే ఫంక్షన్లో ప్రకటించే అవకాశముంది. కె. శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌరాలు సంగీతం అందించారు.

 
Like us on Facebook