మ్యూజిక్ సిట్టింగ్స్ లో నందిని రెడ్డి – నాగ శౌర్య సినిమా

మ్యూజిక్ సిట్టింగ్స్ లో నందిని రెడ్డి – నాగ శౌర్య సినిమా

Published on Dec 18, 2014 8:15 PM IST

Nagasourya
నాగ శౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హీరోయిన్ వేట కొనసాగుతుంది. నాగ శౌర్యకు జోడి ఎంపిక చేయగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

హీరో దర్శకురాలు ఇద్దరితో కళ్యాణ్ కోడూరికి ఇది రెండవ సినిమా కావడం విశేషం. ‘అలా మొదలైంది’తో నందిని రెడ్డికి, ‘ఊహలు గుసగుసలాడే’తో నాగ శౌర్యకి మ్యూజికల్ హిట్స్ అందించారు కళ్యాణ్ కోడూరి.

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ‘అలా మొదలైంది’ సినిమాతో నందిని రెడ్డిని దర్శకురాలిగా కూడా పరిచయం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు