‘పెసరట్టు’లో కీలక పాత్ర చేస్తున్న నందు.

‘పెసరట్టు’లో కీలక పాత్ర చేస్తున్న నందు.

Published on Aug 14, 2014 5:00 PM IST

nandhu-pesaratu
‘ఐస్ క్రీం’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఫ్లోకామ్ టెక్నాలజీను పరిచయం చేయడంతో పాటు మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు ముందు రెమ్యునరేషన్ ఇవ్వకుండా, హిట్ అయితే లాభాలలో వాటా ఇస్తారు. వర్మ స్ఫూర్తితో సినీ విమర్శకుడు, దర్శకుడు కత్తి మహేష్ ‘పెసరట్టు’ సినిమాను తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాన్సెప్ట్ మరియు కథ నచ్చడంతో కీలక పాత్రలో నటించడానికి ముందుకొచ్చారు ‘100% లవ్’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాల ఫేం నందు. నందు హీరోగా నటించిన తాజా సినిమా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

నిశ్చితార్ధం, పెళ్లి నేపద్యంలో కథను ‘పెసరట్టు’ సినిమా కథను రెడీ చేశారు కత్తి మహేష్. సెటైరికల్ కామెడీకి పెద్ద పీట వేస్తున్నారు. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. సినిమాలో మొత్తం 32 సన్నివేశాలు ఉంటాయి. నటీనటులకు 14 రోజుల వర్క్ షాప్ నిర్వచించిన తర్వాత సెప్టెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. 7 రోజులలో షూటింగ్ పూర్తితవుతుంది. ఘంటశాల విశ్వనాద్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని కత్తి మహేష్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు