ఆడిపాడనున్న నాని, లావణ్య

ఆడిపాడనున్న నాని, లావణ్య

Published on May 27, 2015 1:29 AM IST

Nani-and-Lavanya
మారుతీ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘భలే భలే మగాడివోయ్’ లో నాని మరియు లావణ్య త్రిపాటి జంటగా నటిస్తున్నారు. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తుంది. చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు ఈ చిత్రం లో నాని, లావణ్యల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్రెష్ గా వుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీ లో ఒక పాట షూటింగ్ జరుపుతుంది.

యువ మలయాళీ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాట కి రఘు మాస్టర్ నృత్య దర్శకత్వం చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి అవుతుంది. మొత్తం షూటింగ్ జూన్ కి పూర్తి అవుతుంది. ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. గీత ఆర్ట్స్ మరియు యు వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు