ఒకే బంగారంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన నాని

ఒకే బంగారంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన నాని

Published on Apr 18, 2015 12:15 PM IST

ok-bangaram_nani
లెజెండరీ దర్శకుడు మణిరత్నంకు తాను వీరాభిమానినని, ఆయన చేసిన ఎన్నో సినిమాలు తన జీవితంలో చెరగని ముద్రవేసాయని పలు మార్లు తెలిపాడు హీరో నాని. ఎట్టకేలకు నానికి తన గురువుగారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది.

మణిరత్నం తెరకెక్కించిన ఒకే బంగారం సినిమాలో హీరో వాయస్ కి తెలుగులో నాని డబ్బింగ్ చెప్పాడు. సినిమా చుసినవారంతా నాని గాత్రదానం ఎంతో సహాయపడిందని ప్రశంసిస్తున్నారు.

దుల్కర్ నటనకి, నాని గొంతు సరిగ్గా సరిపోయినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏ సెంటర్ ప్రేక్షకులను అలరిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు