బిజీ బిజీగా నాని!

బిజీ బిజీగా నాని!

Published on Jan 21, 2017 5:44 PM IST

nani
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సక్సెస్ లు అందుకుంటున్న యంగ్ హీరో నాని ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు. 2017వ సంవత్సరంలో ఆయన మొదటి సినిమా ‘నేను లోకల్’ రిలీజుకు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తైన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. అందులో భాగంగానే నాని ఈరోజు డబ్బింగ్ ప్రారంభించాడు. అనుకున్న టైమ్ కి సినిమా విడుదలవ్వాలని ఉదయం నుండి గ్యాప్ లేకుండా డబ్బింగ్ చెప్తున్నాడు.

ఈ చిత్రంపై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా విడుదలైన ట్రైలర్, పాటలు యువతకు బాగా కనెక్టవడంతో సినిమా ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉండే అవకాశముంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూజర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాల ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మధ్య సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు