బాలయ్యని ఎగ్జైట్ అయ్యేలా చేసిన నాని

బాలయ్యని ఎగ్జైట్ అయ్యేలా చేసిన నాని

Published on Feb 10, 2016 11:31 AM IST

krishna-gadi-veera-prema-ga
ప్రతి వారం లానే ఈ వారం కూడా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్న సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ సినిమాలో హీరోగా నటించిన నాని సినిమాలో స్టార్ హీరో బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసిన బాలకృష్ణ చాలా ఎగ్జైట్ అయ్యారట.

బాలయ్య ఎగ్జైట్ అయ్యేలా ఏం జరిగిందా అనే విషయంలో వస్తే.. ‘నిజజీవితం లో నేను కమల్ హాసన్ గారికి అభిమానిని. కానీ తెలుగు సినిమాల విషయం వచ్చేసరికి అది సినిమా సినిమాకి మారిపోతుంటుంది. అంటే ఎవరి సినిమా బాగుంటే అప్పటికి వారి అభిమానిని అయిపోతాను. ఈ సినిమాలో మాత్రం బాలకృష్ణ గారి అభిమానిలా కన్పిస్తాను. ఈ విషయం బాలయ్యకి తెలిసి చాలా ఎగ్జైట్ అయ్యారు. మేం రెండో షెడ్యూల్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారిని ఓ సారి కలిసాను. “నానీ మా ఊళ్ళో షూటింగ్ చేస్తున్నావంట. సినిమాలో నువ్వు నా ఫ్యాన్ అంట” అని చాలా ఎగ్జైట్ అయ్యారు. అంతే కాకుండా “నేను హిందూపూర్ లో ఉన్నప్పుడు చెపితే నీ షూటింగ్ చూడటానికి వస్తా” అన్నారని’ నాని తెలిపాడు.

హను రాఘవపూడి దర్శకత్వం లో 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ పతాకం పై రామ్ ఆచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు