వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నాని హీరోయిన్ !

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నాని హీరోయిన్ !

Published on May 30, 2017 11:53 AM IST


నాని నటించిన ‘క్రిష్ణగాడి వీరప్రేమగాధ’ ప్రేక్షకులకు పరిచయమైన నటి మెహ్రీన్ కౌర్ కెరీర్ పరంగా ఆరంభంలో కాస్తంత ఇబ్బందిపడినా ప్రస్తుతం మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్టార్ హీరో రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో, యంగ్ హీరోలైన సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి వారి సినిమాల్లో నటిస్తున్న ఈమె తాజాగా మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంలో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

సాయి శ్రీనివాస్, దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్లో ఇటీవలే ఒక చిత్రం లాంచ్ అయింది. మెహ్రీన్ గత చిత్రాల్లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన దర్శక నిర్మాతలు ఆమెను కథానాయకిగా ఫైనల్ చేశారట. జూన్ నెలలో మొదలుకానున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇండియా, యూఎస్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని మేఘన ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు