మాస్ పాటతో మెప్పించిన నాని !

మాస్ పాటతో మెప్పించిన నాని !

Published on Jan 16, 2018 5:54 PM IST

మెర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాని కృష్ణ, అర్జున్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. సంక్రాతి సందర్బంగా ఈ రెండు పాత్రల యొక్క ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా ఈరోజు సినిమాలోని మొదటి పాట ‘దారి చూడు’ ఉదయం విడుదలైంది.

కృష్ణ పాత్ర పై నడిచే ఈ మాస్ మసాలా సాంగ్ వినడానికి చాలా వెరైటీగా కొత్తగా ఉంది. హిపాప్ తమిజా అందించిన సంగీతంలో కొంత తమిళ ఫ్లేవర్ కలగలిసి ఊపు తెప్పించేలా ఉంది. దానికి తోడు పెంచల్ దాస్ రాసిన లిరిక్స్, పాడిన విధానం కూడా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట సినిమాపై ఆసక్తిని ఇంకాస్త పెంచింది. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాట కొరకు క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు