మొదలైన నాని – లావణ్యల ‘భలే భలే మగాడివోయ్’

మొదలైన నాని – లావణ్యల ‘భలే భలే మగాడివోయ్’

Published on Mar 2, 2015 10:46 AM IST

nani-lavanya
యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ షూటింగ్ ఫినిష్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగానే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. నాని మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఇది వరకే తెలియజేశాం. ‘భలే భలే మగాడివోయ్’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా లాంఛనంగా ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టనున్నారు.

యూత్‌ ఫుల్‌ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి నానితో రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మోడరన్ సిటీ గర్ల్ పాత్రలో కనిపించనుంది. గీత ఆర్ట్స్ సంస్థ – యువి క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ‘కొత్త జంట’ తర్వాత కాస్ట్ గ్యాప్ తీసుకున్న మారుతి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు