మణిరత్నం ప్రాజెక్ట్ పై నాని కామెంట్స్

మణిరత్నం ప్రాజెక్ట్ పై నాని కామెంట్స్

Published on Feb 10, 2016 10:22 AM IST

nani-mani-rathnam
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది నటీనటులకు సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ అయిన మణిరత్నం సినిమాలో చిన్న పాత్రలో అయినా నటించాలని ఆశపడుతుంటారు. అందరిలానే యంగ్ హీరో నాని కోడా ఆయనతో పనిచేయడం తన డ్రీంగా పెట్టుకున్నాడు. మణిరత్నం లాస్ట్ మూవీ ఓకే బంగారం పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఆ సినిమాలో దల్క్వేర్ సల్మాన్ కి నాని డబ్బింగ్ చెప్పాడు. దీని తర్వాత మణిరత్నం నాని హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అన్నీ అనుకొని కొద్ది నెలలు చర్చలు కూడా జరిగాయి.

కానీ కట్ చేస్తే ఆ సినిమా చేయడంలేదని ఆగిపోయిందని వార్తలు వచ్చాటి. అసలు ఎందుకు ఆగిందా అనేది తెలియదు. ఆ తర్వాత నాని చేసిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మణిరత్నం మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘మణిరత్నం గారు ఓ సినిమా అనుకున్నాం.. అప్పట్లో రిలీజ్ అయిన ఓ బాలీవుడ్ మూవీకి, మేమనుకున్న కథకి కాస్త పోలిక ఉండడంతో ఆ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. కానీ ఆయన నాతో సినిమా చేస్తానని చెప్పాడు. కాబట్టి మంచి కథ దొరకగానే మళ్ళీ సినిమా చేస్తామని’ నాని అన్నాడు.

ప్రస్తుతం నాని దృష్టంతా కృష్ణగాడి వీర ప్రేమగాథ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకునే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ పై నాని చాలా నమ్మకంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు