తన సక్సెస్ సీక్రెట్ ని బయటపెట్టిన హీరో నాని

తన సక్సెస్ సీక్రెట్ ని బయటపెట్టిన హీరో నాని

Published on Oct 1, 2016 5:05 PM IST

nani2
ఈ సంవత్సరం ‘మజ్ను’ చిత్రం విజయంతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో వచ్చితిన్ ఈ చిత్రం మొదటి రోజు నుండే ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుంటూ విజయవంతంగా నడుస్తోంది. యూఎస్ లో సైతం ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దేనితో ఈ విజయాన్ని అభిమానులల్తో, ప్రేక్షకులతో పంచుకోవడానికి మజ్ను టీమ్ అన్ని జిలాల్లో పర్యటిస్తున్నారు.

అందులో భాగంగా రాజమండ్రి థియేటర్లను సందర్శించిన నాని తన సినిమాలు వరుస విజయాలు సాధించడానికి, తన సక్సెస్ కు కారణం తాను ఎంచుకున్న పాత్రల్లో జీవించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఇకపోతే ఈ టీమ్ హైదరాబాద్ లోని భ్రమరాంబ, శ్రీరాములు, శాంత్రి, వెంబకటాద్రి థియేటర్లను సందర్శించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు