నాని, సమంతల ప్రతిభకు దక్కిన నంది అవార్డులు !

నాని, సమంతల ప్రతిభకు దక్కిన నంది అవార్డులు !

Published on Mar 1, 2017 4:39 PM IST


తెలుగు ఇండస్ట్రీలోని ఉత్తమ నటీనటులెవరంటే వినిపించే పేర్లలో హీరో నాని, హీరోయిన్ సమంతల పేర్లు తప్పకుండా ఉంటాయి. అంత ప్రతిభ గల వీరు విడివిడిగా నటిస్తేనే ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటిది కలిసి నటిస్తే ఇంకేముంది ప్రతి ఫ్రేమ్ అందంగానే కనిపిస్తుంది. ఆ అందాన్నే ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రంతో కళ్ళకు కట్టినట్టు చూపాడు దర్శకుడు గౌతమ్ మీనన్. 2012 లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో యువతీ యువకులను చాలా గొప్పగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా నాని, సమంతల జంట సినిమాకే హైలెట్ గా నిలిచి ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ జంటలలో చేరిపోయింది. ఇప్పుడు ఈ జంట రెండు నంది అవార్డులను కొల్లగొట్టింది. ఏపి ప్రభుత్వం 2012, 2013వ సంవత్సరాలకు గాను ప్రకటించిన నంది అవార్డుల లిస్టులో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో ఉత్తమ నటన కనబరచినందుకు గాను హీరో నానికి బెస్ట్ హీరో క్యాటగిరీలో నంది అవార్డు దక్కగా హీరోయిన్ సమంత ఉత్తమ నటి క్యాటగిరీలో నంది అవార్డును సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు