నిర్మాతగా ‘హిట్’ అంటున్న నాని…!

నిర్మాతగా ‘హిట్’ అంటున్న నాని…!

Published on Oct 24, 2019 11:01 AM IST

హీరో నాని మరో చిత్ర నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలలో హీరోగా చేసిన విశ్వక్ సేన్ హీరోగా ఆయన ఓ నూతన చిత్రాన్ని నేడు ప్రారంభించారు. ‘హిట్’ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నూతన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రుహాని శర్మ విశ్వక్ సేన్ పక్కన జంటగా నటిస్తుంది. ఈ కాగా నేడు ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. బ్లడ్ అండ్ ఫైర్ తో కూడిన విశ్వక్ లుక్ చూస్తుంటే ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. గతంలో నాని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. ‘హిట్’ మూవీ ఆయన నిర్మాణ సంస్థ లో వస్తున్న రెండవ చిత్రం. కాగా నాని ప్రస్తుతం ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావ్ హైదరి, సుధీర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు