డ్యూయెల్ రోల్ చేయనున్న నాని !

డ్యూయెల్ రోల్ చేయనున్న నాని !

Published on Jun 24, 2017 2:23 PM IST


యంగ్ హీరోల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న హీరో నాని. వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న ఈయన కోసం చాలా యంగ్ డైరెక్టర్లు కథలను సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. నాని కూడా విభిన్నమైన కథల్నే ఎంచుకుంటూ చక చకా సినిమాలు చేసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ సినిమా చేసిన అయన అది విడుదలకాక ముందే దిల్ రాజు నిర్మాణంలో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా చేస్తూనే మరో యువ దర్శకుడు మేర్లపాక గాంధీతో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పూర్తిగా కథల్ని నమ్ముకుని సినిమా మెర్లపాక గాంధీ ఈ సినిమా సబ్జెక్టు ను చాలా వైవిధ్యంగా రూపొందించారని, ఇందులో నాని డ్యూయెల్ రోల్ చేస్తాడని టాక్ కూడా వినిపిస్తోంది. అందులో ఒక పాత్రకి కొంచెం నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. కానీ ఈ వార్త ఎంత మేరకు నిజమో తెలియాలంటే అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు