అభిమానులతో నాని విజయోత్సవ వేడుకలు!

nani-majnu
నాని హీరోగా నటించిన ‘మజ్ను’, గత శుక్రవారం భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఏడాదిన్నరలో నాలుగు హిట్స్ కొట్టిన నాని, ‘మజ్ను’తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబడుతూ దూసుకెళుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా సక్సెస్‍ను సెలెబ్రేట్ చేస్కోవడంతో పాటు, సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతో నాని సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు.

సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 రెండు రోజుల్లో వైజాగ్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో నాని సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు. తమ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లలో అభిమానుల మధ్యన నాని విజయోత్సవ వేడుక జరుపుకోనున్నారు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అనూ ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించారు.

 

Like us on Facebook