కామెడీతో మెస్మరైజ్ చెయ్యడానికి సిద్దమైన నాని

కామెడీతో మెస్మరైజ్ చెయ్యడానికి సిద్దమైన నాని

Published on Aug 29, 2015 6:57 PM IST

bbm
యంగ్ హీరో నాని తన మొదటి సినిమా ‘అష్టా చమ్మా’తోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు. మొదటి సినిమా నుంచే తన డైలాగ్ డెలివరీతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ వస్తున్న నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. నాని ఈ సినిమాకి ఓ మతిమరుపు రాజాగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ నాని కెరీర్లో చేసిన కామెడీ ఒక ఎత్తు, ఈ సినిమాలో నాని చేయబోయే కామెడీ ఒక రేంజ్ అని ఈ చిత్ర టీం అంటోంది. కామెడీ సినిమాలలో హీరోతో పాటు పక్కనే ట్రావెల్ అయ్యే కమెడియన్స్ ఎక్కువగా నవ్విస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం కమెడియన్స్ కంటే నానినే ఎక్కువ నవ్విస్తాడట.

మతిమరుపు కుర్రాడుగా నాని పలికించే హావ భావాలు, తన బిహేవియర్ అన్నిటికీ మించి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో కూడిన తన డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. అలాగే భలే భలే మగాడివోయ్ లో నాని – లావణ్య త్రిపాటి ల కెమిస్ట్రీ కూడా సినిమాకి హైలైట్ అవుతుందని సమాచారం. సినిమా అంటే భారీ బడ్జెట్ కాదు కంటెంట్ ఉండాలి అని లో బడ్జెట్ లో పెద్ద హిట్స్ అందుకున్న మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ బ్యానర్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు