ముంబై మోడల్ తో నాని రొమాన్స్

ముంబై మోడల్ తో నాని రొమాన్స్

Published on Apr 24, 2015 12:15 PM IST

Nani-Mehr-Pirzada
‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలతో హిట్ అందుకున్న యంగ్ హీరో నాని ఫుల్ హ్యాపీగా తన తదుపరి సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్ ని నాన్ స్టాప్ గా చేస్తూ, త్వరలో ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని టాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకున్న గేత ఆర్ట్స్ 2 మరియు యువి క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది కాకుండా నాని త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాని మొదలు పెట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ముంబై మోడల్ అయిన మెహర్ పిర్జదని సెలెక్ట్ చేసారు. చాలా మందిని ఆడిషన్స్ చేసిన తర్వాత మేకర్స్ నని సరసన ఈ ముంబై మోడల్ ని సెలక్ట్ చేసారని సమాచారం. అలాగే ఈ అమ్మాయి స్లిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే మెహర్ విశాల్ చేసిన థమ్స్ అప్ యాడ్ లో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు