హిట్ దర్శకుడితో మరో సినిమా చేయనున్న నాని !
Published on Apr 21, 2017 8:17 am IST


వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన హిట్ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆ దర్శకుడే హను రాఘవపూడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ సినిమా చేస్తున్నాడు.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పూర్తై జూలై కు రిలీజ్ కానుంది. దీని తర్వాత నాని ప్రముఖ దర్శకుడు దిల్ రాజు నిర్మాణంలో మరొక నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేటప్పటికీ నవంబర్ లేదా డిసెంబర్ అవుతుందట. మరోవైపు హను రాఘవపూడి కూడా నితిన్ హీరోగా ‘లై’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. కనుక వీరి ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ఆఖరులో అనౌన్స్ అయ్యే చాన్సుందని తెలుస్తోంది.

 
Like us on Facebook