నేను లేకపోయినా నాకు ‘ఈగ’ సీక్వెల్ కావాల్సిందే – నాని

నేను లేకపోయినా నాకు ‘ఈగ’ సీక్వెల్ కావాల్సిందే – నాని

Published on Sep 27, 2016 5:20 PM IST

nani2
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాని దర్శకుడు రాజమౌళికి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలైన నాని చిత్రం ‘మజ్ను’ లో రాజమౌళి నటించడం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే హీరో నాని అర్జెంటు గా రాజమౌళి దర్శకత్వంలో తాను చేసిన ‘ఈగ’ సినిమాకి సీక్వెల్ కావాలని జక్కన్నను డిమాండ్ చేస్తున్నాడు.

నాని అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయంలో 2012 లో రాజమౌళితో చేసిన చిత్రం ‘ఈగ’ తో అతని దశ తిరిగిందనే చెప్పాలి. ఆ తరువాత నానై హీరోగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనకు అంత మంచి లైఫ్ ఇచ్చిన ‘ఈగ’ సినిమాకి సీక్వెల్ గా ‘ఈగ 2’ తీయాలని, అది రాజమౌళికే సాధ్యమని, తాను ఎప్పుడు ఆయన్ను కలిసినా ఇదే మాట సరదాగా అడుగుతుంటానని నాని అన్నారు. అలాగే టెక్నికల్ గా చూస్తే సీక్వెల్ లో తన పాత్ర ఉండదని తనకు తనకు ‘ఈగ’ సీక్వెల్ కావాల్సిందేనని నాని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు